జీబీఎస్ పై ఆందోళన వద్దు : మంత్రి సత్యకుమార్

-

గులియన్ భారీ సిండ్రోమ్ వ్యాధి పై ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. సచివాలయంలో ఆయన ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. జీబీఎస్ రోగులకు ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. జీబీఎస్ రోగులకు సరిపడా ఇమ్యూనోగ్లోబిన్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. చికిత్స తీసుకోకుండానే చాలా వరకు వ్యాధి తగ్గిపోతుందని చెప్పారు.

రాష్ట్రంలో 43 జీబీఎస్ కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం 17 మంది చికిత్స పొందుతున్నారు. గత ఏడాది ఈ ఏడాది కలిపి మొత్తం రోగుల పూర్వపరాలను పరిశీలించి ఈ వ్యాధి సోకడానికి కారణాలు, దారితీసే పరిస్థితులను గుర్తించాలని వైద్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించాం. ఎప్పటికప్పుడూ పరిస్థితులపై సమీక్షిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో జీబీఎస్ బాధితులకు అందించేందుకు సరిపడా ఇమ్యూనోగ్లోబిన్ ఇంజెక్షన్లు ఉన్నాయి. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ వ్యాధి సోకినా 85 శాతం చికిత్స అవసరం లేకుండా తగ్గిపోతుంది. 15 శాతం మాత్రం ఇంజెక్షన్లు ఇవ్వాల్సిన అవసరం వస్తుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news