కాంగ్రెస్ మంత్రుల మధ్య నామినేటెడ్ పదవుల చిచ్చు !

-

తెలంగాణ రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు పంపిణీ కార్యక్రమం ఇద్దరు మంత్రుల మధ్య చిచ్చు రాజేసినట్టు తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలకు పదవులు కట్టబెట్టేముందు నన్ను సంప్రదించలేదంటూ గుర్రుగా ఉన్నారట మంత్రి పొన్నం ప్రభాకర్.. జిల్లాకు చెందిన మరో మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు సన్నిహితులకే పదవులు దక్కాయని ఆయన మాటే చెల్లుబాటు అవుతుంది నన్ను పట్టించుకోవడం లేదు అని మండిపడుతున్నారట పొన్నం.

ponnam prabhakar vs sridhar babu

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నేరెళ్ల శార‌ద‌, కరీంనగర్ శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి నియామకంపై పొన్నం ఆగ్రహంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను ఓడించే ప్రయత్నం చేసారని అలాంటి వ్యక్తికి నామినేటెడ్ పదవి ఎలా కట్టబెడతారని సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిగా వ్యవహరిస్తున్న దీపా దాస్ మున్షీ వద్ద పొన్నం ప్రభాకర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version