మూసీ సుందరీకరణ కోసం లక్షా యాభై వేల కోట్లు కాదు.. ఎక్కువే : మంత్రి జూపల్లి కృష్ణారావు

-

మూసీ సుందరీకరణ కోసం లక్షా యాభై వేల కోట్లు కాదు.. ఇంకా ఎక్కువే అవుతుందని  మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తాజాగా ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వస్తా అని సవాల్ విసురుతున్నాడని.. హరీ రావు సవాల్ ని నేను స్వీకరిస్తున్నానని, హరీశ్  రావు సవాల్ కు సీఎం రేవంత్ రెడ్డి రావాల్సిన అవసరం లేదు.. నేను చర్చకు వస్తానని ఎక్సైజ్ శాఖామంత్రి జుపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు.

రేవంత్ రెడ్డి ప్రతిష్ఠను దిగజార్చడానికి హరీష్ రావు, కేటీఆర్ లు మాట్లాడుతున్నారన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ లో లక్షా యాభై వేల కోట్ల దోపిడి జరిగిందని ప్రజలను కేటీఆర్, హరీష్ రావు లు తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్,కేటీఆర్, హరీష్ రావులే నీతి మంతులం అంటున్నారని, వాళ్లే నిజాయితీగా పాలన అందిస్తాం అంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణను మొత్తం దోచుకుంది వాళ్లేనని, రాజకీయంగా దివాలా తీసిండ్రు కాబట్టి వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version