రాజకీయాలు కాదు.. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం : హరీశ్ రావు

-

రాజకీయాలు కాదు.. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అన్నారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. తాజాగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించలేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే కేఆర్ఎంబీకీ ప్రాజెక్టులను అప్పగించిందని తెలిపారు. తెలంగాణ  ప్రయోజనాలకు నష్టం కలిగించేలా వ్యవహరించకూడదు అన్నారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాడని పేర్కొన్నారు. తాము పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు సహకరించాడని సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. తాము జులై 04, 2005లోనే మంత్రి పదవులకు రాజీనామా చేశామని గుర్తు చేశారు హరీశ్ రావు. రేవంత్ రెడ్డి నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందన్నారు. ఒక సీఎం అబద్దాలు చెప్పడం.. భాష, ధోరణి చూసి ప్రజలు అసహించుకుంటున్నారని పేర్కొన్నారు. నీచమైన పద్దతిలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పై రేవంత్ వ్యక్తిగత దూషణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేఆర్ఎంబీ సమావేశంలో ప్రాజెక్టులను అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version