త్వరలో వైద్య శాఖలో 13 వేల ఖాళీలకు నోటిఫికేషన్: మంత్రి హరీష్ రావు

-

రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి లో టి- డయాగ్నోస్టిక్ మినీ హబ్ ను, మొబైల్ యాప్ ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో కలిసి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎం జి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తో పాటు పలువురు నాయకులు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేస్తుందని హరీష్ రావు స్పష్టం చేశారు. త్వరలోనే వైద్య ఆరోగ్య శాఖలో 13 వేల నియామకాలు చేపడతామన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడుతుందని మంత్రి పేర్కొన్నారు.

గతంలో ఎన్నడూ లేనంతగా ఆశా వర్కర్లకు జీతాలు పెంచారు అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ బడ్జెట్ ను డబల్ చేశామన్నారు. ప్రభుత్వాసుపత్రుల తోపాటు బస్తీ దవాఖాన లో మందుల కొరత లేదు.. డాక్టర్లు మెడిసిన్స్ బయటకు వ్రాసినట్లు తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కూడా అప్పుడప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం 30 శాతం మాత్రమే కాన్పులు ఉన్నాయని, ఈ ఏళ్లలో 56 శాతం పెరిగాయని హరీష్ రావు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version