హైదరాబాద్ వాసులకు శుభవార్త చెప్పారు మంత్రి హరీష్ రావు. ఏ బస్తి దవాఖానకు వెళ్లిన 57 రకాల పరీక్షలు చేస్తారని.. రాబోయే కొద్దీ రోజుల 134 పరీక్షలు అన్ని బస్తి దవాఖానాలలో చేయనున్నామని ప్రకటన చేశారు మంత్రి హరీష్ రావు. నార్సింగ్ లో టి డయాగ్నోస్టిక్ మినీ హబ్, మొబైల్ యాప్ ప్రారంభంలోమంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఒక్కొప్పుడు దవాఖాన అంటే గాంధీ, ఉస్మానియా అని… బస్తీ ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలని ఉద్దేశ్యంతో బస్తీ దవాఖానలు సీఎం కేసీఆర్ గారు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.
350 బస్తీ ధవాఖానలు ప్రారంభించారని.. ఏ దవాఖాన కు వెళ్లిన వైద్యలు రక్త పరీక్షలు చేయాలని అంటారు,అందుకోసమే తెలంగాణ డయాగ్నోస్టిక్ సేవలు ప్రారంభించడం జరిగిందని వెల్లడించారు. 20 రేడియోలజీ ల్యాబ్స్ ని అందుబాటులోకి తెచ్చుకున్నామని… ఎక్స్ రే, 2 డి ఎకో ,అల్ట్రా సౌండ్,ఈ సి జీ లాంటి పరీక్షలు చేస్తామని స్పష్టంచేశారు. డయాగ్నోస్టిక్ యాప్ ని అందుబాటులోకి తీసుకొచ్చాము, గూగుల్ మ్యాప్ ద్వారా ఆ కేంద్రానికి వెళ్ళవచ్చు.. ఈ యాప్ లో పాత రికార్డ్స్ ని కూడా చూడవచ్చు ,పేషెంట్ హిస్టరీ కూడా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.
నార్సింగ్ లో టి డయాగ్నోస్టిక్ మినీ హబ్, మొబైల్ యాప్ ను ప్రారంభించిన వైద్యారోగ్య శాఖామంత్రి శ్రీ హరీష్ రావు గారు. కార్యక్రమంలో మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ శ్రీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీ ప్రకాష్ గౌడ్, వైద్య అధికారులు పాల్గొన్నారు pic.twitter.com/vMw8BRQZSU
— Office of Minister for Health, Telangana (@TelanganaHealth) May 11, 2022