Notification for 842 Yoga Instructor Posts in Telangana: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు అలర్ఠ్. తెలంగాణ రాష్ట్రంలో 842 యోగా ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చేసింది. 842 యోగా ఇన్‌స్ట్రక్టర్ పోస్టులలో…. 421 పోస్టులను మేల్ అభ్యర్థులు ఉంటారు. మరో 421 పోస్టులను ఫీమేల్ అభ్యర్థులు ఉంటారని వారి ద్వారా భర్తీ చేస్తామని నోటిఫికేషన్ లో వెల్లడించింది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ 842 యోగా ఇన్‌స్ట్రక్టర్ పోస్టులను కాంట్రాక్ట్ బేసిస్‌లో భర్తీ చేస్తున్నట్టు నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.

ఈ నెల 24న ఆదిలాబాద్, హైదరాబాద్ లో ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపింది సర్కార్. 25న నిజామాబాద్, 26న మెదక్, రంగారెడ్డి, లో ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపింది సర్కార్. 27న వరంగల్, నల్గొండ, 28న కరీంనగర్, 30వ తేదీన ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్‌లో ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపింది సర్కార్. పూర్తి వివరాల కోసం https://ayush.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో ఫాలో కావాలని పేర్కొంది.