పిఠాపురంలో హల్ చల్ చేస్తున్న నెంబర్ ప్లేట్లు..!

-

పిఠాపురం ట్రెండింగ్ లో ఉన్న సెగ్మెంట్.. ప్రచారం ఎంత హోరాహోరీగా జరిగిందో.. పోలింగ్ కూడా అంతే ఆసక్తిగా సాగింది. ఎన్నికల ఫలితాల ముందు అదికాస్త పీక్స్ కి చేరుకుంది.  పిఠాపురం నియోజకవర్గంలో ఎవరికివాళ్లు.. మా తాలుకా అంటే.. మా తాలుకా అని.. బోర్డులు తగిలించుకొని తిరుగుతున్నారు. వాహనాలకు నెంబర్ పేట్లకు బదులు.. మా పిఠాపురం ఎమ్మెల్యే ఫలానా అని.. రేడియంతో స్టిక్కరింగ్ చేయిస్తున్నారు.

ఇలా తిరుగుతున్న వాహనాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పిఠాపురంలో ఆధిపత్యపోరు ఓ రేంజ్ లో నడుస్తుంది.. పవన్ అనుచరులు మొదలు పెట్టిన మైండ్ గేమ్క వైసీపీ ధీటుగా కౌంటర్ ఇస్తోంది. మేమేం తక్కువ అంటూ సేం క్యాప్షన్ని.. వైసీపీ కి అప్లై చేసి రాసేస్తున్నారు. కొందరైతే ఇంకో అడుగు ముందుకేసి వంగా గీతకు పదవి కూడా ఇచ్చేశారు. వంగా గీ డిప్యూటీ సీఎం అంటూ కార్ల వెనుక రాయించుకుంటున్నారు. టూవీలర్ నెంబర్ ప్లేట్లను గీత పేరుతో నింపేస్తున్నారు. పిఠాపురంలో ఇరుపార్టీల మధ్య ఆధిపత్య పోరు ముందు నుంచే  కొనసాగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version