తెలంగాణ తల్లికి అధికారిక గుర్తింపు.. ప్రభుత్వం జీవో జారీ

-

తెలంగాణ తల్లి విగ్రహం పై తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నుంచి ఆమోదం తెలుపుతూ గెజిట్ విడుదల చేసినట్టు తెలిపింది ప్రభుత్వం. ఈ జీవోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో, కలెక్టర్ ఆఫీసుల్లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని.. డిసెంబర్ 09న రాష్ట్ర, జిల్లా మండల ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవంగా జరపాలని పేర్కొంది. ప్రభుత్వం ఆమోదించిన తెలంగాణ తల్లిని అధికారికంగా తెలంగాణ తల్లిగా గుర్తిస్తున్నామని జీవోలో స్పష్టం చేసింది.

తాజాగా తెలంగాణ తల్లి విగ్రహం పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ తల్లి అంబే భావోద్వేగం అన్నారు. నాలుగు కోట్ల ప్రజల శక్తి స్వరూపిణి తెలంగాణ తల్లి. మనల్ని లక్ష్యసాధన వైపునకు నడిపించిన తల్లి తెలంగాణ తల్లి. తెలంగాణ నేల స్వేచ్ఛ కోసం పిడికిలి బిగించిన ఉజ్వల జ్వాల. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల శక్తి తెలంగాణ తల్లి. మెడకు కంటే, గుండు పూసల హారంతో తెలంగాణ తల్లి రూపకల్పన జరిగిందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version