ఓమిక్రాన్ ఎఫెక్ట్ : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో క‌ఠిన ఆంక్ష‌లు

ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న కరోనా వైర‌స్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ఎఫెక్ట్ హైద‌రాబాద్ పై ప‌డింది. హైద‌రాబాద్ లో ఉన్న శంషాబాద్ ఎయిర్ పోర్టు లో ఓమిక్రాన్ వేరియంట్ ప్ర‌భావం తో అధికారులు క‌ఠిన ఆంక్ష‌ల‌ను అమలు చేస్తున్నారు. విదేశాల నుంచి వ‌స్తున్న ప్ర‌యాణికుల పై ప‌లు రకాల ఆంక్ష‌ల ను ఎయిర్ పోర్టు అధికారులు విధిస్తున్నారు. అందు లో భాగం గా 72 గంట‌ల ముందు కరోనా వైర‌స్ నిర్ధార‌ణ కు ఆర్టీ పీసీ ఆర్ టెస్ట్ చేసుకుని ఉండాల‌ని తెలిపారు.

ఈ టెస్టు లో త‌ప్ప‌ని స‌రిగా నెగిటివ్ వ‌చ్చి ఉండాల‌ని సూచించారు. అంతే కాకుండా శంషాబాద్ ఎయిర్ పోర్టు లో ల్యాండ్ అయిన త‌ర్వాత కూడా అధికారులు మ‌రో సారి ప‌రీక్ష‌లు చేయ‌నున్నారు. కాగ ద‌క్షిణాఫ్రికాలో మొద‌లైన ఓమిక్రాన్ వేరియంట్ ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తుంది. దీంతో మ‌న దేశంలో కూడా అన్ని ఎయిర్ పోర్టు ల‌లో క‌ఠిన నిబంధ‌న‌లు అమలు చేస్తున్నారు. అందు లో భాగం గా శంషాబాద్ ఎయిర్ పోర్టు లో కూడా అధికారులు క‌ఠిన నిబంధ‌న‌లు అమలు చేస్తున్నారు.