దసరా పండుగ ఏ రోజు జరుపుకోవాలి… క్లారిటీ ఇదే

-

దసరా పండుగ ఏ రోజు జరుపుకోవాలి…అని ప్రశ్న అందరిలోనూ ఇప్పుడు నెలకొంది. అయితే ఈ విషయం పై క్లారిటీ వచ్చింది. దసరా పండుగ ఈ నెల 23న ఉంటుందని తెలంగాణ విద్వత్సభ ప్రకటించింది. రాష్ట్ర ప్రజలందరూ 23న విజయదశమి జరుపుకోవాలని సూచించింది. 100 మంది సిద్ధాంతులు ధర్మశాస్త్రానుసారం చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని తెలిపింది.

ఈ నిర్ణయాన్ని శృంగేరి జగద్గురువులు, కంచి కామకోటి పీఠాధిశ్వరులు, పుష్పగిరి పీఠం, గురుమదనానంద పీఠం పీఠాధిశ్వరులు ఆమోదించారంది. కాగా, పలు క్యాలెండర్లలో ఈ నెల 24న దసరా అని పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా, ప్రభుత్వ స్కూళ్లలో దసరా నాటికి ప్రారంభించాల్సిన సీఎం అల్పాహార పథకాన్ని ఈనెల 6న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 13 నుంచి దసరా సెలవులు ఉండటంతో 6 నుంచి జిల్లాకు ఒక స్కూలులో పథకం అమలు చేసి పరిశీలించనుంది. అక్టోబర్ 26న స్కూల్లు పునః ప్రారంభం కానుండగా… లోపాలను సరిచేసి అన్ని పాఠశాలలకు విస్తరించాలని భావిస్తుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నుంచి ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version