హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ స్టేడియం: సీఎం రేవంత్‌రెడ్డి

-

హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ స్టేడియం నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. స్కిల్ యూనివర్సిటీ సమీపంలో అంతర్జాతీయ స్టేడియం తీసుకువస్తామని చెప్పారు. బ్యాగరి కంచెలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి బీసీసీఐతో చర్చించామని తెలిపారు. క్రీడల కోసం బడ్జెట్‌లో రూ.321 కోట్లు కేటాయించామని వెల్లడించారు. హరియాణా తరహాలో క్రీడాకారులను ప్రోత్సహిస్తామని.. త్వరలో స్పోర్ట్స్ పాలసీని తీసుకువస్తామని పేర్కొన్నారు. స్పోర్ట్స్ పాలసీపై ఎవరు సలహాలు ఇచ్చినా స్వీకరిస్తామని అసెంబ్లీ సాక్షిగా తెలిపారు. భూముల లభ్యత చూసి మండల కేంద్రాల్లో స్టేడియాలు నిర్మిస్తామన్న రేవంత్ రెడ్డి.. తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టేందుకు సిద్ధంగా ఉంటున్నామని చెప్పారు.

క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తాం. నిఖత్ జరీన్‌కు ఆర్థిక సాయం చేశాం.. ఇంటిస్థలం కేటాయించాం. సిరాజ్‌కు విద్యార్హత లేకున్నా గ్రూప్‌-1 ఉద్యోగం ఇస్తున్నాం. రాష్ట్రంలో త్వరలో క్రీడా విధానం తెస్తున్నాం. హరియాణా క్రీడా విధానం పరిశీలిస్తున్నాం. హైదరాబాద్‌లో మరో క్రికెట్ మైదానం వస్తుంది. యూసుఫ్‌గూడ, గచ్చిబౌలి, సరూర్‌నగర్‌ స్టేడియాల్లో క్రీడలు తగ్గాయి. ఎల్‌బీ స్టేడియంలో క్రీడలు తగ్గాయి.. రాజకీయ కార్యకలాపాలు పెరిగాయి. అని రేవంత్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news