కుటుంబంలో ఇద్దరు, ముగ్గురే వ్యవసాయం చేయాలి.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

-

కుటుంబంలో ఇద్దరు, ముగ్గురే వ్యవసాయం చేయాలని  సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మంది వ్యవసాయం చేస్తే.. కుటుంబానికి అప్పులు పెరుగుతాయి. కుటుంబంలో మిగతా వారు బయటికి వెల్లి చదువులు చదువుకొని.. టెక్నాలజీ రంగంలోకి వస్తే.. ఆ కుటుంబం బాగుపడుతుంది. సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకోవాలి. ప్రోత్సహకాలు కూడా అందజేస్తామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.

పరిశ్రమలు నెలకొల్పడానికి భూ కేటాయింపులు కూడా అందిస్తామన్నారు. నిరంతరం విద్యుత్ సరఫరా చేయగలగాలి. చైనాతోనే పోటీ పడగలం. పరిశ్రమల అవసరాలకు తగినట్టు నైపుణ్యాలు ఉండటం లేదని పరిశ్రమల కంపెనీలు పేర్కొన్నారు. వ్యవసాయాన్ని ఎవ్వరూ వదలొద్దు. కానీ ఇప్పుడు హైదరాబాద్ లో ఒక ఎకరం అమ్మితే.. కృష్ణా, గుంటూరులో 100 ఎకరాలు కొనవచ్చు. గత ప్రభుత్వం ఇచ్చిన ఇంటెన్సివ్ హామీలను మేము నెరవేర్చుతామని తెలిపారు. మంచి పనులు ఎవ్వరూ చేసినా వాటిని కొనసాగిస్తామని తెలిపారు. స్కిల్ యూనివర్సిటీ చైర్మన్ గా ఆనంద్ మహేంద్ర ను నియమించామని తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version