ఏపీలో నూతన మద్యం పాలసీకి కేబినెట్ ఆమోదం

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీకి ఆమోద ముద్ర వేసింది. అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ మీటింగ్ లో నూతన మద్యం పాలసీ పై సుదీర్ఘ చర్చ జరిపిన అనంతరం వివిధ రాష్ట్రాల్లో ఉన్న మద్యం పాలసీలను అధ్యయనం చేసిన తరువాత మద్యం పాలసీకి ఆమోదం తెలిపింది. ఇటీవలే భారీ వర్షాలు కురిసిన విషయం విధితమే. భారీ వర్షాలకు గండ్లు పడి పొంగి పొర్లిన బుడమేరు సమస్యపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చ జరుపుతోంది.

ఇలాంటి విపత్తులు మరోసారి ఎదురుకాకుండా చేపట్టాల్సిన చర్యలపై మంత్రులందరూ తమ తమ అభిప్రాయాలను చంద్రబాబుకు తెలియజేశారు. ఇక బీసీలకు 33 శాతం రిజర్వేషన్ పై కూడా చర్చించిన తరువాత కేబినెట్ అసెంబ్లీలో తీర్మాణం చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయించినట్టు సమాచారం. రాష్ట్రంలో 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో తీసుకున్న నిర్ణయాలు, పారిశ్రామిక అభివృద్ధి రేటు, విద్యుత్ సంస్కరణలపై మంత్రి మండలి చర్చించింది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version