కొత్త లబ్ధిదారులకు రైతు బంధు పథకం అమలుకానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఈనెల 5వ తేదీ వరకు కటాఫ్ తేదీని నిర్ణయించింది. అంటే ఆ తేదీ వరకు రిజిస్ట్రేషన్ అయిన, పట్టాదారు పాసు పుస్తకాల జారీ అయిన భూములను రైతుబంధు పోర్టల్ లో నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. కొత్తగా యాజమాన్య హక్కులు పొందిన రైతులు, పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డు అలాగే బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్స్ కాఫీ లను స్థానిక వ్యవసాయ విస్తరణాధికారి కి అందజేయాలి.
ఆదివారం ఉదయం నుంచి ఏ ఈ ఓ లాగిన్ ను ఓపెన్ చేశారు. సిసిఎల్ఎ డేటా ఆధారంగా రైతుల వివరాలను అధికారులు అప్లోడ్ చేస్తారు. ముందుగా కట్ ఆఫ్ తేదీని ప్రకటించి కొత్త లబ్ధిదారుల నమోదు ప్రారంభిస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త లబ్ధిదారుల నమోదుకు రెండు రోజులు మాత్రమే అవకాశం కల్పించడమే అసంతృప్తి వ్యక్తమవుతోంది. కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి రైతు బంధు నిధులు…రైతుల ఖాతాలలో జమ కానున్నాయి.