తెలంగాణలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం బాగా పెరిగింది: చిదంబరం

-

తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకుంది. పోలింగ్​కు మరో పద్నాలుగు రోజులు మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలను రంగంలోకి దించింది. ఇప్పటికే పలువురు నేతలు రాష్ట్రంలో పర్యటిస్తుండగా.. శుక్రవారం రోజున రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే రాష్ట్రానికి రానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం గాంధీ భవన్​లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్ సర్కార్​పై తీవ్ర విమర్శలు చేశారు.

కేసీఆర్ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందని చిదంబరం అన్నారు. రాష్ట్రంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం బాగా పెరిగిందని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర అప్పులు‌ రూ.3.66 లక్షల కోట్లకు పెరిగిందని.. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి తలపై రూ.96 వేల అప్పు ఉందని వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో‌ పెట్టేందుకు కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.

“అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం. బడ్జెట్ దృష్ఠిలో పెట్టుకునే ఆరు గ్యారెంటీలు ప్రకటించాం. విద్యారంగానికి బడ్జెట్ పూర్తిగా తగ్గించారు. కాంగ్రెస్ వస్తే ఉద్యోగాల భర్తీ చేస్తాం, నిత్యావసరాల ధరలు తగ్గిస్తాం. శ్రీ కృష్ణ కమిటీ సిఫార్సులన్ని పక్కన పెట్టి తెలంగాణ ఏర్పాటు చేశాం.” అని చిదంబరం అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version