పద్మశాలీల రుణం తీర్చుకుంటానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించిన పద్మశాలిల అఖిల భారత సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. రైతన్నలకు ఇస్తున్న ప్రాధాన్యతను నేతన్నలకు కూడా ఇస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎన్నికల్లో తనను ఆశీర్వదించిన కుటుంబాలకు ఏదైనా చేయాలనే తపనతో ఉన్నానని, పద్మశాలీల రుణం తీర్చుకుంటానని వెల్లడించారు.
డ్వాక్రా మహిళలకు రెండు చీరలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. 1.30 కోట్ల చీరలు నేసే ఆర్డర్లను నేతన్నలకే ఇస్తున్నట్టు హైదరాబాద్ అఖిల భారత పద్మశాలి మహాసభలో సీఎం ప్రకటించారు. కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే కంటే ఎక్కువగానే చూపించామని తెలిపారు. మహారాష్ట్రలో ఉన్న సోలాపూర్‌లోని మార్కండేయ భవన నిర్మాణానికి ప్రభుత్వం నుండి 1 కోటి రూపాయలు ఇస్తున్నానని తెలిపారు.