సికింద్రాబాద్ పార్లమెంట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. సికింద్రాబాద్ పార్లమెంట్ లో మొత్తం 21లక్షల 20వేల 401 ఓట్లకు గాను… 10 లక్షల39 వేల 843ఓట్లు పోల్ అయ్యాయి. సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి బరిలో 46 మంది అభ్యర్థులు ఉన్నారు. 7 కేంద్రాల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది.
3 ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీ…ఉంది. అత్యధికంగా జూబ్లీహిల్స్ సెగ్మెంట్ కి 20 టేబుళ్లు, మిగిలిన 6 నియోజకవర్గాలకు 14 చొప్పున మొత్తం 119 టేబుళ్లు ఏర్పాటు చేశారు. అత్యధికంగా ముషీరాబాద్, నాంపల్లి సెగ్మెంట్ లలో 20 రౌండ్ ల లెక్కింపు ఉంటుంది. ఖైరతాబాద్ 18, అంబర్పేట్, జూబ్లీహిల్స్, సనత్ నగర్, నియోజకవర్గాల్లో 17, సికింద్రాబాద్ 16 రౌండ్ ల కౌంటింగ్ ఉండనుంది. అయితే.. తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానంలో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి ఖైరతాబాద్ MLA దానం నాగేందర్, BRS నుంచి లోకల్ MLA పద్మారావుగౌడ్ నువ్వానేనా అంటున్నారు. అయితే.. MP పదవిని వారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నప్పటికీ వీరు ఓడినా MLAలుగా కొనసాగనున్నారు. గెలిస్తే MP అవుతారు. ఇక్కడ సిట్టింగ్ MP కిషన్‌రెడ్డి(BJP)ని వీరు ఢీకొంటున్నారు.