తెలంగాణ వచ్చాక కూడా పాలమూరు జిల్లాకు అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నారయణపేటలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. గత ప్రభుత్వం పేదల ఇళ్ల పై నిర్లక్ష్యం వహించింది. డబుల్ బెడ్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని.. పదేళ్లు అయినా ఇవ్వలేదు. మా ప్రభుత్వం ఇవాళ ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించుకుంది. నియోజకవర్గానికి 3500 ఇండ్లను కేటాయించనున్నట్టు తెలిపారు. పాలమూరు పేదరికాన్ని చూపించి మార్కెటింగ్ చేశారు. మా గోడును మాత్రం పట్టించుకోలేదు.
మా ప్రభుత్వం 5 లక్షల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది అన్నారు. పాలమూరు ప్రజలు బీఆర్ఎస్ కి ఓట్లు వేయలేదా..? అని ప్రశ్నించారు. పదేళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే.. ఇవాళ చంద్రబాబు నాయుడితో కొట్లాడే పరిస్థితి వచ్చేదా..? అని ప్రశ్నించారు. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి నీళ్లు రాయలసీమకు తీసుకెళ్తుంటే.. వాళ్ల చెప్పులు మోసి ఊడిగం చేసింది నువ్వు కాదా..? అని ప్రశ్నించారు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో హరీశ్ రావు మంత్రి కాదా..? అని ప్రశ్నించారు.