బీజేపీ, బీఆర్ఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్..!

-

బీజేపీ, బీఆర్ఎస్ కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. నారాయణపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గత పదేళ్లు కేసీఆర్ పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు అని ప్రశ్నించారు. కేసీఆర్ కి పాలమూరు ప్రజలు ఎంపీ పదవీ ఇచ్చిన బిక్ష అన్నారు. మోడీ, కేసీఆర్ పరిపాలన పై చర్చ పెడదాం.  బీఆర్ఎస్ హయాంలో పదేళ్లు, ప్రధాని మోడీ 12 ఏళ్ల పాలన, 12నెలల తెలంగాణలో ప్రజా పాలన పై చర్చ పెడుదాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ తరపున, ప్రతిపక్ష హోదా తరపున బీఆర్ఎస్, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ తరపున నేను వస్తా.. ఎక్కడైనా సరే చర్చిద్దాం అని సవాల్ విసిరారు.

ఆనాడు కృష్ణా జలాలను తరలించుకుపోతుంటే చూస్తూ కూర్చుంది నీవు కాదా..? అని ప్రశ్నించారు. పాలమూరు జిల్లాలో పరిశ్రమలు ఎందుకు తరలించుకుపోాయారు. కేసీఆర్ గట్టిగా కొడతా అంటున్నాడు.. గట్టిగా కొట్టేది అంటే.. ఫుల్, హాప్ తప్ప ఏమి కొట్టలేవు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 

Read more RELATED
Recommended to you

Latest news