ఈ నెల 16న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వెట్ రన్ ప్రారంభం

-

ఈ నెల 16న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వెట్ రన్ ప్రారంభం కానుంది. ఈ తరుణంలోనే నార్లాపూర్ ఇన్ టేక్ వద్ద స్విచ్ ఆన్ చేసి ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. ప్రపంచంలోనే భారీ పంపులతో ఎత్తిపోతలకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సిద్ధమైంది.

palamuru
palamuru

2 కిలో మీటర్ల దూరంలోని నార్లపూర్ రిజర్వాయర్ లోకి నీటి ఎత్తిపోత చేయనుంది ఈ ప్రాజెక్టు. ఈ సందర్భంగా కృష్ణమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్న సీఎం కేసీఆర్..నార్లాపూర్ ఇన్ టేక్ వద్ద స్విచ్ ఆన్ చేసి ప్రారంభించనున్నారు. అదే రోజు భారీ బహిరంగ సభ నిర్వహణ కూడా ఉండనుంది.

పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అడ్డంకులు తొలిగినందుకు గ్రామాల్లో దేవాలయాల్లో దేవుళ్ల  పాదాలను పాలమూరు జలాలతో అభిషేకం చేసి మొక్కు తీర్చుకోవాలని ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ కోరారు.  పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నీళ్లు  రావడం దక్షిణ తెలంగాణ కు పండుగ రోజుగా ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన స్ఫూర్తితోనే పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయాలని ఆయన అధికారులను కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news