పాలమూరు రుణం తీర్చుకుంటా.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

-

పాలమూరు బిడ్డకు సీఎం అయ్యే అవకాశం వచ్చిందంటే కురుమూర్తి స్వామి దయనే అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్ లో కురుమూర్తి స్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజ నర్సింహలకు అర్చకులు వేదాశీర్వచనాలు ఇచ్చారు.  ఆలయ సమీపంలోని ఘాట్ రోడ్డు కారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకు స్థాపన చేశారు.  ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇప్పటికీ కురుమూర్తి స్వామి ఆలయంలో మౌలిక సదుపాయాలు లేవు.. అందుకే రూ.110 కోట్లతో ఘాట్ రోడ్డు కారిడార్ నిర్మిస్తున్నామని తెలిపారు.

దేశంలో ఏ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలోనైనా పాలమూరు ప్రజల కృషి ఉందన్నారు. మన రాష్ట్రంలో మాత్రం గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నారు. కేసీఆర్ హయాంలో పాలమూరుకు పరిశ్రమలు, ప్రాజెక్టులు రాలేదు. ఇక్కడ ఇంకా వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. పాలమూరు జిల్లాలో 12 మంది ఎమ్మెల్యేలు, 1 ఎంపీ, ఒక సీఎంను ఈ ప్రాంతం ఇచ్చింది. పాలమూరు రుణం తీర్చుకుంటామన్నారు. యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు వచ్చేలా చూస్తామన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news