తుమ్మలకు సీఎం కేసీఆర్ చేసిన అన్యాయం ఏంటి? అంటూ పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇవాళ పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తుమ్మల నాగేశ్వరరావుపై ఫైర్ అయ్యారు. తుమ్మల నాగేశ్వరరావు కి కేసీయార్ చేసిన అన్యాయం ఏంటి? అంటూ నిలదీశారు.
ఓడిపోయిన తుమ్మల కి పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేయడం అన్యాయమా? అని నిలదీశారు. ఐదేళ్ళు మంత్రిగా జిల్లాను అప్ప చెబితే జిల్లాలో ఒక్క సీటు గెలవలేదు… తాను గెలవలేక పోయారని ఆగ్రహించారు. షర్మిల తెలంగాణ కోడలు ఎలా అవుతుంది ? అంటూ ప్రశ్నించారు. ఆమె రెండేళ్లు గా ఏమి చెప్పింది.. ఇప్పడు ఏమీ చేస్తుంది? అని నిలదీశారు పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి.