టీ కాఫీ కప్పుల కి మరకలు అయిపోవడం సహజమే. కప్పుల్లో టీ మరకలు లేదంటే కాఫీ మరకలు అయిపోతూ ఉంటాయి. వాటిని తొలగించుకోవడం కష్టంగా ఉంటుంది. కానీ ఇలా కనుక చేసినట్లయితే ఈజీగా మరకలు అన్నీ కూడా మాయమైపోతాయి. క్లీన్ గా మీ కాఫీ కప్పులు,మగ్గులు ఉంటాయి. చాలా మంది మంచి కాఫీ కప్స్ ని మగ్స్ n వాడుతూ ఉంటారు ఒక్కొక్కసారి టీ కాఫీ మరకలు వాటిల్లో పడిపోతూ ఉంటాయి. దానిని తొలగించుకోవాలంటే ఇలా చేయండి.
బేకింగ్ సోడా ఇందుకు బాగా ఉపయోగపడుతుంది బేకింగ్ సోడా తీసుకుని కొంచెం నీళ్లు వేసి పేస్ట్ లాగా చేసుకోండి ఈ పేస్ట్ ని మీరు మరక మీద బాగా రాయండి మృదువైన బ్రష్ తో తర్వాత రుద్దండి ఇలా చేయడం వలన సులభంగా మరక పోతుంది. నిమ్మరసంతో కూడా మరకల్ని వదిలించుకోవచ్చు. మరక పడిన కప్పులో నిమ్మరసం ని పిండండి ఒక 15 నిమిషాల పాటు దానిని అలా వదిలేయండి.
తర్వాత బ్రష్ తో సున్నితంగా స్క్రబ్ చేసి నీళ్లతో శుభ్రం చేసేసుకుంటే సరిపోతుంది. తళతళా కప్పు మెరిసిపోతుంది. ఉప్పు కూడా చాలా చక్కగా పనిచేస్తుంది నీళ్లలో కొంచెం ఉప్పు వేసి ఆ నీటితో మీరు కాఫీ మగ్గుని క్లీన్ చేసుకుంటే ఈజీగా మరకలు అన్నీ కూడా పోతాయి. వైట్ వెనిగర్ తో క్లీన్ చేసినా కూడా మరకలు దూరం అవుతాయి ఇలా సింపుల్ గా కాఫీ మరకలు టీ మరకలు వదిలించుకోవచ్చు.