పాస్ బుక్ ఉన్నవాళ్ళందరికి రైతు రుణమాఫీ చేయాల్సిందే – పల్లా రాజేశ్వర్ రెడ్డి

-

పాస్ బుక్ ఉన్నవాళ్ళందరికీ రైతు రుణమాఫీ చేయాల్సిందేనని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్‌ చేశారు. తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..31 వేలకోట్లు అని చెప్పి 6 వేల కోట్లు ఇచ్చి ఇవాళ రైతుబంధును ఎగ్గొట్టారు… మేము రాగానే రైతుబంధును రైతు భోరోసా చేసి ఎకరాని 5 వేలకు బదులు 7500 ఇస్తామన్నారని గుర్తు చేశారు. ఎకరానికి 7500 చొప్పున ఒక కోటి 50 లక్షల ఎకరాలకు దాదాపు 12500 కోట్లు అవుతాయి.. అవి ఎక్కడికి పోయాయి? అని నిలదీశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి.

palla rajeshwar reddy on runamafi

తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని మోసం చేసేవిధంగా రేవంత్ రెడ్డి, వారి మంత్రి వర్గం, వారికి వంత పాడే కొన్ని డబ్బాలు అబద్ధాలు చెబుతున్నాయి….వారు చెప్పేవి చూస్తే నిజంగా గోబెల్స్ బ్రతికి ఉంటే చనిపోయేవాడన్నారు. రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామన్నారు….గోరంత కొండంత చేసి చూపిస్తున్నారని ఆగ్రహించారు.

ప్రభుత్వం నిన్న వేసింది కేవలం 6వేల కోట్లలో 10 లక్షల రైతులకు మాత్రమే వేసింది….వారి ప్రచారం చూస్తే మొత్తం రెండు లక్షల రుణమాఫీ జరిగిందని చెప్తున్నారని నిప్పులు చెరిగారు. గతంలో ఇచ్చిన మాట కు కట్టుబడి కేసిఆర్ 16 వేల కోట్లు రైతుల ఋణం మాఫీ చేశాం….ఆ తర్వాత 12వేల కోట్లు వేశాం, మిగితా 7 వేల కోట్లు వేయాలంటే రైతు బంధు ఆపాలని ఎలక్షన్ కమిషన్ ను కలిసి ఆపింది మీరే కదా అని ప్రశ్నించారు. రుణమాఫీ కి ఎలాంటి ఆంక్షలు కేసిఆర్ ప్రభుత్వం పెట్టలేదని..
పాస్ బుక్ ఉన్నవాళ్ళందరికి రైతు రుణమాఫీ చేశామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version