టికెట్ దక్కని వారిని బుజ్జగించే పనిలో పడింది బీఆర్ఎస్ పార్టీ. ఈ నేపథ్యంలోనే స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ను కలిసేందుకు హన్మకొండలోని ఆయన నివాసానికి వెళ్లారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. అక్కడ రాజయ్య లేకపోవడంతో చాలాసేపటి వరకు ఎదురు చూసి పల్లా వెనుతిరిగారు. అయితే రాజేశ్వర్ రెడ్డిని కలిసేందుకు ఎమ్మెల్యే రాజయ్య నిరాకరించినట్లు సమాచారం.
అనంతరం రాజయ్య అనుచరులతో పల్లా రాజేశ్వర్ రెడ్డి భేటీ అయ్యారు. రాజయ్యకు అధిష్టానం సముచిత స్థానం కల్పిస్తుందని, రెండు మూడు రోజుల్లోనే కేసీఆర్ ను కలుస్తామని తెలిపారు. రాజయ్య, కడియం శ్రీహరి, తాను కలిసి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంపై గులాబీ జెండాను ఎగరేస్తామని అన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. రాజయ్య రాజకీయ భవిష్యత్తును సీఎం కేసీఆర్ గారు చూసుకుంటారని రాజయ్య అనుచరులకు హామీ ఇచ్చి వెళ్లిపోయారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.