నల్గొండ అసెంబ్లీ స్థానానికి కోమటిరెడ్డి దరఖాస్తు

-

నల్గొండ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం ఆ పార్టీ సీనియర్ నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం దరఖాస్తు చేసుకున్నారు. 2018 ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓటమి పాలైన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి పోటీ చేయనున్నారు. 

ఏపీ నుంచి 1999లో నల్గొండ స్థానం నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆనాడు సీపీఎం అభ్యర్థి నంద్యాల నర్సింహారెడ్డి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  విజయం సాధించారు. 2004, 2009, 2014 ఎన్నికల్లో కూడా ఇదే స్థానం కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. 2018లో నల్గొండ నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈ ఏడాది చివరిలో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మరోసారి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బరిలోకి దిగనున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news