తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా పాలమూరు జిల్లాకు న్యాయం జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా నారాయణపేట లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పదేళ్లు సీఎం గా ఉన్నా పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఇప్పుడు ఏపీతో గొడవ ఉండేది కాదు అన్నారు. ఎంపీగా గెలిపించి రాజకీయ భిక్ష పెట్టిన జిల్లాను ఎడారిగా మార్చారు. ఈ పాపం ఆయనదే. రూ.లక్సల కోట్లు మింగి కాళేశ్వరం కడితే కూలిపోయిందని నారాయణపేట సభలో ఆరోపించారు.
సంవత్సరంలో 5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వని ఊర్లలో ఓట్లు అడగమని.. అలాగే బీఆర్ఎస్ కూడా డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చిన ఊర్లలోనే ఓట్లు అడగాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. “నా జిల్లాను అభివృద్ధి చేయడానికి ఈ రాష్ట్ర బడ్జెట్ నుండి ఎన్ని వేల కోట్లు అయినా ఖర్చుపెడుతాను” అని పేర్కొన్నారు.