నీళ్లు ఉంటేనే పంటలు వేసుకోండి : వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి

-

రైతులు నీళ్లు ఉంటేనే పంటలు వేసుకోండి అని కిసాన్ ఫార్మర్ వెల్పేర్ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తెలంగాణ రైతాంగానికి  కీలక విజ్ఞప్తి చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు.  ఫిబ్రవరి నెలలో ఉన్నాం. సాధారణంగా మార్చి తరువాతనే ఎండలు ముదురుతాయి. కానీ అలాంటి పరిస్థితికి భిన్నంగా ఫిబ్రవరిలోపు ఎండలు తీవ్రంగా వచ్చాయి. ఎక్కడ పడితే అక్కడ పంటలు ఎండిపోతున్నట్టుగా.. రైతులు ఇబ్బందులు పడుతున్నట్టు మా కమిషన్ దృష్టికి వచ్చింది. రైతాంగానికి ఒకటే మనవి.. ప్రకృతి ఒక రకంగా ఉండదు. తెలంగాణలో బాగా ఎక్కువ వర్షాలు పడిన రోజులను చూసినట్టయితే.. 2022, 2023లోనే అధికంగా పడ్డాయి. గ్రౌండ్ వాటర్ కూడా 13.42 మి.మి. చేరింది. 

ప్రస్తుతం గ్రౌండ్ వాటర్ విపరీతంగా పడిపోయిందని.. బోర్లకు నీళ్లు అందే పరిస్థితి లేవు. భారీ పెట్టుబడి పెట్టి కొత్త బోర్లు వేస్తున్నారు. కమిషన్ ఎప్పుడు కూడా రైతాంగం క్షేమాలు చూస్తుంది. ఉన్న పంటలను కాపాడుకోండి. అదనంగా వరి వేయడానికి మంచి పద్దతి కాదు. పదే పదే రైతాంగం మానసిక ఒత్తిడి గురి చేసే స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. ఇది మంచి పద్దతి కాదు. రైతుల ఆత్మ స్థైర్యాన్ని పెంచండి. రేవంత్ రెడ్డి సీఎంగా సహాయం చేశారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version