హైదరాబాద్ మెట్రో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుండి మెట్రో స్టేషన్లో పార్కింగ్ కోసం పైసల్ వసూల్ చేయాలనీ నిర్ణయించుకుంది. ఈ మెట్రో పార్కింగ్ తాజాగా ఎల్ అండ్ టి ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ పార్కింగ్ ఫీజు అన్ని మెట్రో స్టేషన్ లలో ఉండదు. కేవలం నాగోల్. మియాపూర్ స్టేషన్ లలో మాత్రమే పార్కింగ్ వసూళ్లకు నిర్ణయం తీసుకుంది.
ఈరోజు నాగోల్ స్టేషన్ లో ప్రయోగత్మాకంగా ఈ పార్కింగ్ ఫీజ్ అమలును చేపట్టారు. అయితే ఈనెల 25 నుంచి నాగోల్ మెట్రో వద్ద.. సెప్టెంబర్ 1 నుంచి మియాపూర్ స్టేషన్ వద్ద పార్కింగ్ ఫీజులు వసూల్ చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎల్ అండ్ టి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మెట్రో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగోల్, మియాపూర్ అనేవి మెట్రోలో చివరి స్టేషన్ లుల కాబట్టి అక్కడి నుండి సిటీ లోపలికి వచ్చేవారు ఎక్కువ మంది అక్కడ పార్కింగ్ ను ఉపయోగిస్తారు. అందుకే ఆ రెండు స్టేషన్ లలో ఈ పార్కింగ్ ఫీజు అనేది ప్రారంభించనున్నారు అధికారులు.