పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సోదరుడు మధుసూదన్‌ అరెస్టు

-

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ తెల్లవారుజామున పటాన్చెరులోని ఆయన నివాసానికి వచ్చిన పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రభుత్వ భూమిలో అక్రమ మైనింగ్ కేసులో ఆయణ్ను అరెస్టు చేసినట్లు చెప్పారు. అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం లగ్దారం గ్రామంలో మైనింగ్ చేసేందుకు మధుసూదన్ రెడ్డికి చెందిన సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ సప్లయ్ కంపెనీ క్వారీనీ తవ్వుతోంది. కేంద్ర పర్యావరణ నిబంధనలు ఉల్లగించి పరిమితికి మించి తవ్వకాలు జరపడం, అనుమతుల గడువు అయిపోయినా మైనింగ్ చేశారని ఇటీవల క్వారీని అధికారులు సీజ్ చేశారు. అనంతరం చర్యలు తీసుకోవాలని పటాన్చెరు పోలీసులకు తహశీల్దార్ ఫిర్యాదు చేశారు. అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈరోజు ఉదయం అతన్ని అరెస్ట్ చేశారు. మధుసూదన్ను అరెస్ట్ చేయడంతో పోలీస్ స్టేషన్కు భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు, మదుసూదన్ అనుచరులు చేరుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version