Patolla Karthik Reddy sensational statement on leaving BRS : బీఆర్ఎస్ పార్టీని వీడటంపై పటోళ్ల కార్తిక్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. నేను పార్టీ మారను, మా అమ్మ పార్టీ మారదు. బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటామని ప్రకటించారు పటోళ్ల కార్తిక్ రెడ్డి. ఆ రోజు ప్రత్యేక పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నుండి మారాం కానీ రాజకీయ అవసరాల కోసం, పనుల కోసం మారలేదని వెల్లడించారు పటోళ్ల కార్తిక్ రెడ్డి.

మా ఆడ బిడ్డ కవిత జైలు లో ఉండి 120 రోజులు దాటిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగా మేము బీజేపీతో కాం ప్రమైజ్ చేసుకొని ఉంటే కవిత ఇంకా ఎందుకు జైలులో ఉంటుందని అడుగుతున్నా అని ప్రశ్నించారు పట్లో ళ్ల కార్తీక్ రెడ్డి. ఇక పై పార్టీ మారుతామని ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు.