కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్ కు బాలీవుడ్ నటుడు సోనూసూద్

-

హైదరాబాద్లో చార్మినార్ ఎంత ఫేమసో ఇక్కడి బిర్యానీ అంతే ఫేమస్. ఇక హైదరాబాద్లో ఫుడ్ స్టాల్స్ గురించి మాట్లాడుకుంటే అందరి మదిలో మెదిలే మొదటి పేరు కుమారీ ఆంటీ. రోడ్డు పక్కన ఓ చిన్న ఫుడ్ స్టాల్ పెట్టుకున్న ఈ మహిళ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్. ఆమె ఫుడ్ స్టాల్ను ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా సందర్శించారు.

తాజాగా కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్ వద్ద ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ సందడి చేశారు. తన సినిమా షూటింగ్లో భాగంగా హైదరాబాద్ వచ్చిన సోనూసూద్కు మారి ఆంటీ ఫుడ్ స్టాల్ ను సందర్శించి ఆమె కుటుంబసభ్యులతో సరదాగా గడిపారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చి పుడ్ స్టాల్ పెట్టుకొని అసామాన్య గుర్తింపు తెచ్చుకున్నారు కుమారి ఆంటీ అని సోనూసూద్ కొనియాడారు. ఈ తరం మహిళలకు ఆమె ప్రేరణ అని తెలిపారు. ఈ సందర్భంగా కుమారీ ఆంటీని సన్మానించిన సోనూ ఆమెకు స్వయంగా భోజనం వడ్డించారు. తన ఫతే చిత్రానికి సెలబ్రిటీగా కుమారి అంటీని రావాలని సోనూసూద్ ఆహ్వానించారు.

Read more RELATED
Recommended to you

Latest news