రైతులతో హమాలీ పైసలు చెల్లించడం దుర్మార్గం : ఈటల రాజేందర్

-

కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ బియ్యం కొంటున్నప్పుడు సుతిల్ దారం, గన్ని బాగ్, ట్రాన్స్పోర్ట్, హమాలీ పైసలు ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఎఫ్సీఐకి ఇస్తుందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (r) అన్నారు. కానీ ఇక్కడ  ఐకేపీ సెంటర్లో ఉండే మార్కెట్ యాజమాన్యాలు అవన్నీ చెప్పకుండా రైతులతోనే హమాలీ పైసలు చెల్లించడం దుర్మార్గమైందన్నారు. హమాలీ పైసలు కూడా ప్రభుత్వమే భరించాలని ప్రభుత్వాన్ని కోరారు. సొమవారం జనగామలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఈటల రాజేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం మొత్తంలో రైతులు పండించిన పంటకి
ఎంఎస్పీని పెంచి రైతులకు అందించాలన్న సంకల్పంతో కేంద్రం అనేక రకాల నూతన పద్ధతులకు
శ్రీకారం చుట్టిందన్నారు.

ఎఫ్సీఐ  బియ్యం కొనడం, సీసీఐ  పత్తిని కొనడం కావచ్చు ఇవన్నీ గవర్నమెంట్ చేస్తుందని తెలిపారు. ఇక్కడ పత్తి రూ. 7,521 ఎంఎస్పీ కింద నిర్ణయిస్తే మిల్లర్లు రకరకాల ఒత్తిడులకు గురిచేస్తున్నారన్నారు. కిషన్ రెడ్డి నేను రైతంగంతో చర్చించి సీసీఐతో చర్చించి కాంటాలు పెట్టమని ఆదేశాలు ఇస్తే రైతులు తమకు తెలిసిన, దగ్గరలో ఉన్న మిల్లుకు తీసుకెళ్తే వాళ్లు డబ్బులు ఇచ్చే పద్ధతికి అంగీకారం జరిగిందన్నారు. వడ్లకు రూ. 2,320 ఎంఎస్పీ నిర్ణయించారన్నారు. ప్రతిసారి కూడా ఇబ్బంది కలిగించే మాటేమిటంటే మిల్లులు తక్కువ.. పంట అని పేర్కొన్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version