కాంగ్రెస్ శ్రేణులకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వార్నింగ్..!

-

పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘి స్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం గాంధీభవన్ లో నిర్వహించిన మెదక్ జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కాంగ్రెస్ లో అంతర్గత తగాదాల పట్ల పార్టీ శ్రేణులపై మండిపడ్డారు. పార్టీ లో క్రమశిక్షణ అనేది చాలా కీలకమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్ళి పార్టీ బలోపేతానికి, గెలుపు లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ప్రజల మద్దతు ప్రభుత్వానికి సంపూర్ణంగా ఉండేలా కృషి చేయాలన్నారు.

క్షేత్ర స్థాయిలో మరింత విస్తృతంగా పని చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ
ఎన్నికలలో పార్టీ విజయాల కోసం అంతా కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. పార్టీ కోసం
పని చేసే కార్యకర్తలకు తప్పక గుర్తింపు ఉంటుందన్నారు. నియోజక వర్గ ఇంచార్జ్ లు భేషజాలకు
పోకుండా కలిసికట్టుగా పని చేసి మంచి ఫలితాలు తేవాలన్నారు. ప్రజలకు, పాలనా యంత్రాంగానికి
మధ్య పార్టీ నాయకత్వం వారధిగా పని చేసి ప్రభుత్వానికి మంచిపేరు  తీసుకురావాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version