తెలంగాణలోని సూర్యపేట జిల్లా చివ్వెంల సమీపంలోని దురాజ్ పల్లిలో లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతరకు భక్తులు పోటెత్తారు. ఆదివారం అర్థరాత్రి నుంచి మొదలైన రద్దీ కొనసాగుతోంది. లక్షల సంఖ్యలో బక్తులు స్వామికి బోనం సమర్పించేందుకు తరలివస్తున్నారు. మొక్కులు చెల్లించుకుంటున్నారు. లింగమంతుల స్వామి, చౌడమ్మ తల్లి దర్శనానికి భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. మేడారం తరువాత తెలంగాణలో ఇదే రెండో అతిపెద్ద జాతర.
ఇవాళ పెద్ద గట్టు జాతరలో మూడో రోజు చంద్రపట్నం వేసి స్వామి వారి కళ్యాణం నిర్వహించేందుకు దేవాలయ శాఖ అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. లింగమంతుల స్వామిని దర్శించుకునే పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతున్నారు. తెలంగాణతో పాటు ఛతీస్ గడ్, మహారాష్ట్ర, ఏపీ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.