E-Challan : వాహనదారులకు అలర్ట్… E-Challan : పెండింగ్ చలానా రాయితీ గడువు మరో 5 రోజులే ఉంది. పెండింగ్ ట్రాఫిక్ చలానా అలా చెల్లింపునకు వాహనదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. పోలీసుల రికార్డుల ప్రకారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్ చలానాలు ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం డిసెంబర్ 25 వరకు ఉన్న వాటిపై భారీగా రాయితీ ప్రకటించిన విషయం విధితమే.
ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 80% ఆర్టీసీ బస్సులకు 90%, ఇతర వాహనాలకు 60% రాయితీ ప్రకటించడంతో మంచి స్పందన లభిస్తోంది. ఈ మేరకు గత నెల 26 నుంచి 11 రోజుల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 76.79 లక్షల చలానాలకు సంబంధించి రూ. 66.77 కోట్ల చెల్లింపులు జరిగాయి. ఈ అవకాశం మరో ఐదు రోజులు మాత్రమే ఉందని నగర ట్రాఫిక్ అదనపు సీపీ ఎం. విశ్వప్రసాద్ తెలిపారు. వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.