తెలంగాణ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుందని వార్తలు వస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఫొటోలు, వీడియోలకు నిషేధం విధించిందని అంటున్నారు.
ఈ మేరకు శాసనసభ లాబీల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారట. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు కొత్తగా ఈ నిషేధ నిబంధనలు అమలుచేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
ప్రతిపక్షాలు చేపట్టే ఆందోళనల ఫొటోలు, వీడియోలు బయటకు వెళ్లకుండా ఉండాలనే ఇలా చేశారంటూ విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దీనికి సంబంధించిన న్యూస్ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా.. నిన్నటి నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే.