ఆంధ్రప్రదేశ్ లో ప్రజా సమస్యలపై కూటమి ప్రభుత్వంతో పోరాడాల్సిన సమయం వచ్చిందని.. ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ ప్రజా పక్షాన నిలబడాల్సిందేనని వైసీపీ నేతలకు పిలుపునిచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి. తాజాగా ఆయన పార్టీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడారు. ప్రజల పక్షాన వైసీపీ ఉందనే మెసేజ్ బలంగా వెళ్లాలని సూచించారు. వారి గొంతకగా మనం ప్రభుత్వాన్ని నిలదీద్దామన్నారు. ప్రజా సమస్యలపై ప్రబుత్వం దిగి వచ్చే వరకు మనం వారికి అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైంది అని తెలిపారు.
బరితెగించి వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం పై కలిసి కట్టుగా పోరాడుదాం అని పార్టీ నేతలతో పేర్కొన్నారు. అధికారం చేపట్టిన తొలిరోజు నుంచే అధికార టీడీపీ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ సహా హామీలను వేటిని నిలబెట్టుకోలేకపోయింది అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నాశనం చేసింది. పేదల జీవితాల్లో వెలుగులు నింపిన పథకాలను.. వాళ్లకు అందకుండా చేశారు. ఇంటింటికే డెలివరీ లాంటి వ్యవస్థలను కూకటి వేళ్లతో పెకిలించారని తెలిపారు.