పింక్ బుక్ కామెంట్స్.. కవితకు జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

-

కవిత తన ఉనికి కోసమే రాహుల్ గాంధీపై కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి దుయ్యబట్టారు. తాజాగా ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు.  పింక్ బుక్ పేరుతో రేవంత్ రెడ్డిని కవిత అనవసరంగా రెచ్చగొడుతున్నారని గతంలో నరేంద్ర మోడీని రెచ్చగొట్టడం వల్లే నాలుగు నెలలు జైలు పాలయ్యారని పేర్కొన్నారు. పింక్ బుక్ రాయడానికి కవితకు ఏం అవసరం వచ్చింది. పాపం ఆడపిల్లవు మొన్ననే నాలుగు నాలుగు నెలలు జైలుకు వెల్లి వచ్చావు.

ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది సీఎం రేవంత్ రెడ్డి తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. మీరు కూడా ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి. కేసీఆర్ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి వెళ్లారు. చేసిన తప్పులంతా మీరే చేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పై తప్పుల చిట్టా రాయడం ఏంటి..? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ భయంతోనే వరంగల్ కు రాలేకపోయారనే కవిత విమర్శలకు స్పందిస్తూ కవిత తన స్తాయిని తెలుసుకొని మాట్లాడాలని ఆమె తన ఉనికిని కాపాడుకునేందుకు అలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news