పీకే సర్వే: కారులో డ్యామేజ్ ఎక్కువేనట!

-

ఇప్పటికే రాజకీయ వ్యూహార్త ప్రశాంత్ కిషోర్…తెలంగాణలో తన రాజకీయ వ్యూహాలని అమలు చేయడం మొదలుపెట్టేశారని చెప్పొచ్చు..ఇటీవలే గజ్వేల్ నియోజకవర్గం నుంచి తన వ్యూహాలు అమలు చేయడం మొదలుపెట్టిన పీకే…రాష్ట్రం మొత్తం తన వ్యూహాలని అమలు చేయడం స్టార్ట్ చేశారు..ఆ వ్యూహాల్లో భాగంగానే కేసీఆర్…జాతీయ స్థాయిలో బీజేపీని టార్గెట్ చేయడం…ఇక కాంగ్రెస్ కు కాస్త అనుకూలంగా మాట్లాడుతున్నట్లు కనిపించడం చేస్తున్నారు.

అలాగే రాష్ట్రంలో టీఆర్ఎస్ పరిస్తితిపై కూడా పీకే సర్వేలు చేస్తున్నారని తెలిసింది..దాదాపు 22 అంశాలపై పీకే టీం సర్వే చేస్తున్నట్లు తెలుస్తోంది…ఎమ్మెల్యేల పనితీరు, ఎంపీల ప్రోగ్రెస్, మంత్రుల పర్ఫామెన్స్, పథకాలు అమలు, నియోజకవర్గాల్లో అభివృద్ధి, దళితబంధు స్కీమ్, రైతులు, కులాలవారీగా ఓట్లు వాటి ప్రభావం లాంటి అంశాలపై పీకే సర్వే చేస్తున్నారు..అయితే వీటిల్లో చాలా వరకు టీఆర్ఎస్ కు వ్యతిరేకమైన ఫలితాలే కనిపిస్తున్నాయట. మెజారిటీ సర్వేల్లో టీఆర్ఎస్ పై వ్యతిరేకత కనిపిస్తుందని తెలుస్తోంది.

ముఖ్యంగా పీకే టీమ్‌ సర్వేలో టీఆర్‌ఎస్‌ వైఖరిపై ఉద్యమకారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వెల్లడైంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014లో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చింది…అప్పటి నుంచి బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా కాంగ్రెస్‌, టీడీపీ నుంచి పెద్ద ఎత్తున చేరికలను అధిష్ఠానం ప్రోత్సహించింది. అలా పార్టీలోకి వచ్చిన వారికే కేసీఆర్ ప్రాధాన్యత ఇచ్చారు గాని, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన నేతలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు.  ఈ క్రమంలో బంగారు తెలంగాణ బ్యాచ్‌తో పోల్చుకుంటే ఉద్యమ తెలంగాణబ్యాచ్‌కు చాలా తక్కువ పదవులు దక్కాయి. కొందరినైతే ఇప్పటికీ పట్టించుకోవడం లేదు.

అదే సమయంలో ద్వితీయ శ్రేణి నాయకులు అధికారులను ఇబ్బంది పెడుతూ, వారిపై పెత్తనం చేస్తూ క్షేత్ర స్థాయిలో పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను సమన్వయం చేయలేకపోతున్న విషయాన్ని పీకే టీమ్‌ గ్రహించిందని తెలిసింది…అంటే ఓవరాల్ గా పీకే టీం సర్వేలో టీఆర్ఎస్ పై వ్యతిరేకత ఉందనే విషయం బాగా అర్ధమవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version