రైతులకు గుడ్‌ న్యూస్‌.. ఖాతాల్లోకి నగదు ఎప్పుడంటే?

రైతులందరికీ కేంద్రం తీపి కబురు చెప్పబోతోంది. రైతులకు ప్రధాని నరేంద్ర మోదీ ఇస్తున్న స్కీముల్లో ప్రధాని మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఒకటి. రైతులకు రూ. 6000 ఈ స్కీమ్ ద్వారా అందిస్తోంది. అయితే, రైతుల ఖాతాల్లోకి మరోసారి నగదు బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైంది.

పీఎం కిసాన్ పథకం కింద 13 వ విడత నిధులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. పిఎం కిసాన్ 13వ విడత నిధులను త్వరలోనే విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ఈ డిసెంబర్ నుంచి వచ్చే మార్చి వరకు నిధులను విడుదలవారీగా రైతుల ఖాతాలో జమ చేయనుంది. కాగా ఇక ఈ పథకం నిధులు పొందాలంటే కచ్చితంగా రేషన్ కార్డు నెంబర్ ను సమర్పించాల్సి ఉంటుంది. మీ రేషన్ కార్డు నెంబర్ను సమర్పించకపోతే ఈ పథకం నిధులు మీ ఖాతాలో అసలు పడవు. కాబట్టి అందరూ తమ రేషన్ కార్డు నెంబర్ను అటాచ్ చేయాల్సి ఉంటుంది.