రామోజీ రావు మృతి నేపథ్యంలో…తెలుగులో మోడీ పోస్ట్ పెట్టి.. సంతాపం తెలిపారు. శ్రీ రామోజీ రావుగారి మరణం ఎంతో బాధాకరం.ఆయన భారతీయ మీడియాలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన ఒక దార్శనికుడు.ఆయన సేవలు సినీ,పత్రికారంగాలలో చెరగని ముద్ర వేశాయి.

తన అవిరళ కృషి ద్వారా, ఆయన మీడియా, వినోద ప్రపంచాలలో శ్రేష్టమైన ఆవిష్కరణలకు నూతన ప్రమాణాలను నెలకొల్పారని వెల్లడించారు కాబోయో ప్రధాని నరేంద్ర మోడీ. రామోజీ రావు గారు భారతదేశ అభివృద్ధి పట్ల చాలా ఉత్సాహం చూపేవారు.
ఆయనతో సంభాషించడానికి, ఆయన అపారమైన జ్ఞానాన్నుంచి లబ్ధి పొందేందుకు అనేక అవకాశాలు పొందడం నా అదృష్టం. ఈ దుఃఖ సమయంలో అతని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు అసంఖ్యాక అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి అంటూ ఎమోషనల్ అయ్యారు.