బీసీల కోసం ప్రధాని మోడీ ఏమీ చేయలేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బీసీ వ్యక్తి బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉంటే తొలగించారని చెప్పారు. బీజేపీకి బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఇదేనా అని ప్రశ్నించారు. రేవంత్ వ్యాఖ్యలపై నానా హైరానా చేస్తున్నారని మండిపడ్డారు. ఓబీసీ అంటూ ప్రచారం చేసుకున్నారే తప్ప వాళ్లకేమీ చేయలేదని విమర్శించారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఏఐసీసీ ఇన్ చార్జీగా పని చేసిన దీపాదాస్ మున్షీకి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మద్దతుగా నిలిచారు. ఈమేరకు ఆయన శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. దీపాదాస్ మున్షీ నిబద్ధత, నిజాయితీ, క్రమశిక్షణ గల నాయకురాలు అని.. ఆమె పార్టీని బలోపేతం చేయడంలో కృషి చేశారని పేర్కొన్నారు.