ప్రపంచంలోనే అతి గొప్ప లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అని కొనియాడారు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. 5 వందలు 6 వందలు మీటర్ల లోతునుంచి నీళ్లను లిఫ్ట్ చేసే గొప్ప కార్యక్రమం అన్నారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చూపే ప్రభుత్వ యత్నాన్ని తిప్పికొడతామని చెబుతూ బీఆర్ఎస్ పార్టీ చలో మేడిగడ్డ పర్యటనకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు సందర్శనకు బీఆర్ఎస్ నేతలు బయల్దేరారు.
మొదటగా తెలంగాణ భవన్ చేరుకున్న నేతలు అక్కడ అల్పాహారం సేవించి బస్సుల్లో మేడిగడ్డకు బయల్దేరారు. కేసీఆర్ మినహా మిగతా బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డకు వెళ్తున్నారు. ఈ సందర్బంగా పోచారం మాట్లాడుతూ… బీమా, నేటం పాడు ప్రాజెక్టు లు పూర్తి చేసి వలసలు ఆపేసామని పేర్కొన్నారు. 86 పిలర్లలో 3 పిలర్లు కుంగియాని.. దానికే పెద్ద ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. గతం లో 40 ఏండ్లు అయిన ఒక్కో దగ్గర ప్రాజెక్టు లు పూర్తి కాలేదు కానీ మన కాళేశ్వరం మూడు ఏండ్ల లో పూర్తి చేసామని చెప్పారు. రైతు బంధుకు గతి లేదు ఇప్పటికి మూడు సార్లు పెండింగ్ లో పెట్టారని ఫైర్ అయ్యారు.