సొంత డబ్బులతో స్కూల్ కట్టించారు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి. రూ. 2 కోట్ల 50 లక్షలతో నిర్మించిన ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించారు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూర్ మండలంలోని సిర్శావాడ గ్రామంలో ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.2 కోట్ల 50 లక్షలతో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ప్రారంభించారు.
తాను చదువుకున్న పాఠశాలను తానే నిర్మించడం అదృష్టంగా భావిస్తున్నానని, తన చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే ఉండి రాబోయే రోజుల్లో ఇంకా చాలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని మర్రి జనార్ధన్ రెడ్డి తెలిపారు. అయితే…నాగర్ కర్నూల్ పాఠశాల ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ రగడ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కాకుండా మాజీ ఎమ్మెల్యేను ఎలా ప్రారంభించడానికి అనుమతిస్తారు అంటూ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలోనే..మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి మీద కేసు నమోదు చేశారు పోలీసులు.