BRSతో పొత్తు లేదు..17 సీట్లల్లో బీజేపీ పోటీ – MP లక్ష్మణ్

-

BRSతో పొత్తు లేదు..17 సీట్లల్లో బీజేపీ పోటీ చేస్తుందని బీజేపీ MP లక్ష్మణ్ ప్రకటించారు. 17 సీట్లలో బిజెపి పోటీ చేస్తుంది…BRS తో పొత్తు లేదు, పార్లమెంట్ బోర్డ్ మెంబర్ గా చెప్తున్నానని వివరించారు. వాళ్ళు కాళ్ళ బేరానికి వచ్చినా పొత్తు ఉండదు…ఆంధ్రలో పొత్తులపై అధిష్టానం నిర్ణయిస్తుందని వెల్లడించారు. ఏపీలో జనసేన తో పొత్తు ఉందన్నారు డాక్టర్ లక్ష్మణ్. బిజెపి కన్వెన్షన్ లో దేశ వ్యాప్తంగా ప్రతినిధులు పాల్గొన్నారు…

రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బిజేపి అగ్రనాయకత్వం దిశానిర్దేశం చేశారన్నారు. రానున్న వంద రోజుల్లో బిజెపి కార్యాచరణ ను స్పష్టం చేశారు…బిజెపి 370 స్థానాలు రానున్న ఎన్నికల్లో గెలవనుందని చెప్పారు. ఎన్డీయే తో కలిపి 400 సీట్లకు పైగా గెలవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ముందే కాంగ్రెస్ కాడ ఎత్తేసింది…మూడో సారి మోడీ మళ్ళీ ప్రధాని కాబోతున్నారన్నారు బీజేపీ MP లక్ష్మణ్. రానున్న లోక్ సభ ఎన్నికలు మహాభారత యుద్ధమని… విపక్షాలు కౌరవ సైన్యంగా ఉంటే వాళ్ళను మోడీ నేతృత్వంలో బిజేపి గెలుపు ఖాయమని పేర్కొన్నారు.

 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version