అరికెపూడి గాంధీని ఇంటికి తరలించిన పోలీసులు..!

-

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మధ్య రెండు రోజుల నుంచి పార్టీ ఫిరాయింపులు, పీఏసీ చైర్మన్ పదవీ గురించి వాగ్వాదం చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇవాళ తొలుత అరికెపూడి గాంధీ నివాసానికి తాను వెళ్తానని కౌశిక్ రెడ్డి ప్రకటించారు. కౌశిక్ రెడ్డి రాకుంటే తానే వెళ్తానని అరికెపూడి గాంధీ మీడియాకు వెల్లడించారు. కౌశిక్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో.. స్వయంగా అరికెపూడి గాంధీ కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇంటి బయట అరికెపూడి గాంధీ అనుచరులు ధర్నా కు దిగారు. కౌశిక్‌రెడ్డిపై గుడ్లు, టమాటాలు విసిరారు గాంధీ అనుచరులు.. కౌశిక్‌రెడ్డి ఇంట్లో ధర్నాకు కూర్చున్నారు గాంధీ. కౌశిక్ రెడ్డి ఇంటి గేటును విరగ్గొట్టి ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించారు అరికేపూడి గాంధీ అనుచరులు కౌశిక్‌రెడ్డి దమ్ముంటే బయటకు రావాలి నేను ఇక్కడే ఉంటానని అరికె పూడీ గాంధీ ప్రకటించారు. ఇక ఈ సంఘటనపై బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి స్పందించారు. గాంధీ మీద చర్యకు ప్రతీ చర్య కచ్చితంగా ఉంటుందని మీడియాకు వెల్లడించారు కౌశిక్ రెడ్డి. తాజాగా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని తన నివాసానికి తరలిస్తున్నారు పోలీసులు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version