నన్ను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇంటి బయట అరికెపూడి గాంధీ అనుచరులు ధర్నా కు దిగారు. కౌశిక్‌రెడ్డిపై గుడ్లు, టమాటాలు విసిరారు గాంధీ అనుచరులు.. కౌశిక్‌రెడ్డి ఇంట్లో ధర్నాకు కూర్చున్నారు గాంధీ. కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు అర్కేపూడి గాంధీ అనుచరులు.
ఇక అర్కేపూడి గాంధీ అనుచరులు చేసిన రచ్చపై స్పందించారు బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. నన్ను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపణలు చేశారు బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. అరికెపూడి గాంధీ బీఆర్ఎస్‌లో ఉంటే.. గులాబీ కండువా కప్పుకోవడానికి అభ్యంతరం ఏంటి? అని పేర్కొన్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. రేపు గాంధీ ఇంటికి బీఆర్‌ఎస్ కార్యకర్తలతో కలిసి.. వెళతానని వెల్లడించారు బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.