మధుయాష్కీ నివాసంలో అర్ధరాత్రి పోలీసులు సోదాలు

-

తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారం జోరందుకుంటోంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో పూర్తిగా నిమగ్నమయ్యాయి. ఓవైపు అభ్యర్థులు ప్రచారంలో బిజీబిజీగా ఉంటే.. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థుల ఇళ్లలో పోలీసులు, ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఇటీవలే తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి ఇళ్లలో ఐటీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పుంజుకుంటోందన్న కారణంతోనే అధికార బీఆర్ఎస్.. దాని మిత్రపార్టీ బీజేపీలు కలిసి కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఐటీ దాడులు చేయిస్తున్నారని పొంగులేటి ఆరోపించారు.

ఇది మరవకముందే తాజాగా ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ నివాసంలో మంగళవారం అర్ధరాత్రి సోదాలు చేసేందుకు పోలీసులు వెళ్లారు. డయల్‌ 100కు ఫిర్యాదు రావడంతో సోదాలు చేసేందుకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఆయన నివాసంలో భారీగా నగదు ఉందని అందుకే తనిఖీ చేయడానికి వచ్చామని పోలీసులు చెబుతుండగా.. వారిని మధుయాష్కీ అడ్డుకున్నారు. సెర్చ్‌ వారెంట్‌ లేకుండా సోదాలు ఎలా చేస్తారని మధుయాష్కీ పోలీసులను నిలదీశారు. సోదాల పేరుతో భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news